ETV Bharat / state

YS Sharmila latest news: షర్మిల యాత్రకు చిన్న బ్రేక్.. ఎల్లుండి నుంచి నిరాహార దీక్ష - నల్గొండ జిల్లా వార్తలు

short break for Sharmila praja prasthanam yatra
షర్మిల ప్రజాప్రస్థానం యాత్రకు స్వల్ప విరామం
author img

By

Published : Nov 10, 2021, 1:02 PM IST

Updated : Nov 10, 2021, 2:05 PM IST

13:00 November 10

ఎన్నికల కోడ్‌ దృష్ట్యా షర్మిల పాదయాత్రకు స్వల్పవిరామం

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రస్థాన యాత్రకు స్వల్ప విరామం ఇచ్చినట్లు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS Sharmila latest news) ప్రకటించారు. ఎన్నికల కోడ్(mlc elections in telangana) ముగిసిన వెంటనే మళ్లీ పాదయాత్ర(ys sharmila padayatra 2021) ప్రారంభిస్తామన్నారు. ఇప్పటివరకు 21 రోజుల పాటు... 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 గ్రామాల్లో పాదయాత్ర పూర్తిచేసినట్లు ఆమె వెల్లడించారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొండపాక గూడెం వద్ద మీడియాతో మాట్లాడిన షర్మిల... వరి రైతుల పక్షాన వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. వచ్చే శుక్రవారం నుంచి 72 గంటలు రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. 91శాతం మంది రైతులు రాష్ట్రంలో అప్పుల పాలయ్యారని ధ్వజమెత్తారు. రైతులకు తెరాస ప్రభుత్వం ఏం మేలు చేసిందని ప్రశ్నించారు.

వరి పంట కొనకపోవడం రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదని... కేంద్రం కొనడంలేదని ఇప్పుడు చెప్పడం విడ్డూరమన్నారు. అవసరమైతే భాజపాతో కొట్లాడుతానని సీఎం కేసీఆర్ అన్నారని ఆమె(YS Sharmila latest news) గుర్తుచేశారు. ఆఖరు గింజ వరకు కొంటానని సీఎం కేసీఆర్ హామీనిచ్చారని... ఇప్పుడు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్టఅని ఆమె ఆరోపించారు. వరి వేసుకున్న వాళ్లు దాన్ని అమ్మలేక... రోడ్లపై ధాన్యం పోసుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  

ఇదీ చదవండి: Etela Rajender Oath: ఏడోసారి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం

Last Updated : Nov 10, 2021, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.