ETV Bharat / state

ఆసనాలలో రాటుదేలింది... అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది

నేటి కాలంలో అతివలు అవని నుంచి ఆకాశం వరకు అన్ని రంగాల్లోను దూసుకెళ్తున్నారు. సాధన చేస్తే కాదేదీ అసాధ్యమంటూ నిరూపించిందో చిన్నారి. ఒళ్లును విల్లులా వంచుతూ మహా మహులకే చెమటలు పట్టించే ఆసనాలను అవలీలగా వేస్తూ ఔరా అనిపిస్తోంది నల్గొండ జిల్లాకు చెందిన కావేరి. పోటీ ఏ స్థాయిదైనా పతకం ఖాయం అనే స్థాయికి చేరింది.

యోగాలో చిన్నారి ప్రతిభ
author img

By

Published : Jul 9, 2019, 6:48 AM IST

Updated : Jul 9, 2019, 7:29 AM IST

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన రుద్రారపు కావేరి కఠినమైన యోగాసనాలు అవలీలగా వేస్తూ ఔరా..! అనిపిస్తోంది. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి మూడో ఏట నుంచే యోగాపై ఆసక్తి పెంచుకుంది. యోగా శిక్షకుడిగా పనిచేస్తున్న తండ్రి మల్లేష్​ కూతురులోని పట్టుదలకు మెరుగులద్ది అంతర్జాతీయ స్థాయిలో తురుపుముక్కలా తీర్చిదిద్దాడు.

అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి

కావేరి తన ప్రతిభతో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది. 2016-17లో రెండు సార్లు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. గతేడాది అక్టోబరులో కర్ణాటక దావనగిరిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. ఆ విజయంతో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. తండ్రి ప్రోత్సాహం, శిక్షణతోనే ఈ స్థాయికి చేరుకున్నానంటోంది కావేరి.

యోగాలో చిన్నారి ప్రతిభ
తన కూతురు అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని మల్లేష్​ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. యోగాలో తనదైన ముద్ర వేస్తున్న చిన్నారి తమ ప్రాంతానికే కాకుండా దేశానికే పేరు తెచ్చిపెడుతోందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హర్షం వ్యక్తం చేశాడు.

చేయూతనిచ్చి చూడండి...దేశం గర్వించేలా చేస్తా...

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని... ప్రభుత్వం, దాతలు స్పందించి చేయూతనిస్తే దేశానికి పేరు తీసుకొస్తానంటోందీ చిన్నారి.

ఇదీ చూడండి: శంషాబాద్​లో 150 కిలోలకు పైగా బంగారం స్వాధీనం

sample description
Last Updated : Jul 9, 2019, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.