నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పురస్కరించుకుని ఎమ్మెల్యే భాస్కరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆ మూడు లక్ష్యాలు నెరవేరాయని తెలిపారు.
రైతు బంధు, రైతు బీమా పథకాలతో దేశంలోనే తెలంగాణ రైతులను అగ్రగామిగా నిలుపుతున్నారని పేర్కొన్నారు. ఆరేళ్ల తెలంగాణలో అభివృద్ధి అద్వితీయంగా ఉందని, ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తూ జలాశయాల వద్ద నిరసనలు చేపట్టడం విడ్డూరమన్నారు.
- ఇదీ చూడండి : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్