నల్గొండలో సీతారాముల కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక కోదండ రామాలయంలో జరిగిన కల్యాణ ఘట్టాన్ని వీక్షించి భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో సీతారాములను ఉంచి... వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వివాహ వేడుకను కన్నుల పండువగా సాగింది. వేలాదిగా హాజరైన భక్తులకు... ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించడంతో పాటు అన్నదానం చేశారు.
ఈ ఉత్సవాల్లో నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: కన్నుల పండువగా సీతారాముల కల్యాణం