హాజీపూర్ హత్యోదంతం రెండో కేసులో వాంగ్మూలాలు పూర్తయ్యాయి. నిందితుడికి మొదటి పోక్సోచట్టం కోర్టు వాంగ్మూలాలు చదివి వినిపించింది. తల్లిదండ్రులను తీసుకురావాలని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని... గతనెల 26న కోర్టు ఆదేశించింది. వారి జాడ తెలియకపోవడం వల్ల పోలీసులు సమన్లు జారీ చేయలేదు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు కోర్టుకు హాజరుకాలేకపోయారు.
తల్లిదండ్రులను తీసుకురాగలవా అని శ్రీనివాస్‌రెడ్డిని న్యాయవాది అడిగారు.. మరో కేసును న్యాయస్థానం విచారించనుంది.
ఇదీ చూడండి : తప్పుడు పత్రాలతో రుణం... ఎస్బీఐ అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు