ETV Bharat / state

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 74 మంది పోటీ - తెలంగాణ తాజా వార్తలు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక నామపత్రాల పరిశీలన పూర్తయింది. ఇద్దరిని అనర్హులుగా రిటర్నింగ్​ అధికారులు ప్రకటించారు. మిగిలిన 74 మంది పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు.

Scrutiny Completed for graduate mlc election nominations

author img

By

Published : Feb 24, 2021, 7:15 PM IST

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈనెల 16 నుంచి 23 వరకు అందిన దరఖాస్తులను రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. వివిధ కారణాలతో ఇద్దరిని అనర్హులుగా ప్రకటించారు. పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తంగా 76 నామినేషన్లు వచ్చాయి.

వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి తెరాస తరఫున పల్లా రాజేశ్వర్​రెడ్డి, భాజపా నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్​ తరఫున రాములు నాయక్​, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థులు తీన్మార్‌ మల్లన్న, సుదగాని హరిశంకర్‌ నామపత్రాలు దాఖలుచేశారు.

ఇవీచూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.