ETV Bharat / state

SANITISATION IN SCHOOLS: ముమ్మరంగా శానిటైజేషన్.. ప్రత్యక్ష బోధనకు ముస్తాబు - sanitisation in govenrment schools

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని బోధనా విద్యాసంస్థలు తెరుస్తామని ప్రకటించింది. ఈమేరకు ఈ నెల 30లోగా అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్​ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్కూళ్లలో పారిశుద్ధ్య పనులను ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అధికారులు అప్పగించారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు కూడా తెరుచుకోనున్నాయి.

sanitisation in schools
ప్రభుత్వ పాఠశాలలు
author img

By

Published : Aug 29, 2021, 7:22 PM IST

గతేడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్ విధించడంతో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఆ తరువాత ప్రభుత్వం లాక్​డౌన్ పొడిగిస్తూ వచ్చింది. చివరికి సడలింపు ఇచ్చినప్పటికీ కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కరోనా తగుముఖం పట్టడంతో ప్రత్యక్ష బోధన చేపట్టారు. అటు ఏపీ ప్రభుత్వం ఇటీవలే పాఠశాలలు పున:ప్రారంభించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం.. వైద్యాధికారులతో సమీక్షించిన తర్వాత ఎట్టకేలకు పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికైనా పాఠశాలలు తెరవకపోతే పిల్లలు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని.. విద్యాసంస్థలు తెరవాలని వైద్యాధికారులు ప్రభుత్వానికి సూచించడంతో అంగన్వాడీ కేంద్రాలతో సహా పునఃప్రారంభానికి సిద్ధమైంది.

సెప్టెంబర్​ 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 30లోగా పూర్తయ్యేలా.. పట్టణాల్లో మున్సిపాలిటీ, గ్రామాల్లో గ్రామ పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో సర్పంచులు చర్యలు తీసుకొని పాఠశాలల్లో శానిటైజేషన్, పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు, పట్టణాల్లోని పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

ముమ్మరంగా శానిటైజేషన్

నల్గొండ మండలం దండంపల్లి గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలను డీఈవో భిక్షపతి పరిశీలించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ బెంచీకి ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తామని డీఈవో చెప్పారు. ఉపాధ్యాయులంతా వందశాతం హాజరుతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30లోగా శానిటైజేషన్​ పూర్తయ్యేలా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. ఎవరికైనా కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే.. వైద్యాధికారుల సలహాల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటాం. తల్లిదండ్రుల అనుమతి పత్రం, ఆన్​లైన్ తరగతులపై పూర్తిగా మాకు ఎలాంటి సమాచారం అందలేదు. పిల్లల తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పాఠశాలకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. -భిక్షపతి, నల్గొండ డీఈవో

సెప్టెంబరు 1నుంచి పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం. గ్రామ పంచాయతీ సహకారంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -రామ్మోహన్​, దండంపల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్​ మాస్టర్​

ఇదీ చదవండి: Devadula Review: 'దేవాదుల జలాలు పూర్తిగా సద్వినియోగం చేయాలనేదే సీఎం ఆలోచన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.