ETV Bharat / state

సాగర్ గండి పూడ్చే పనులు వేగవంతం చేసిన అధికారులు.. ఎన్ని రోజులు పడుతుందంటే - నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పనులు ప్రారంభం

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ గండి పడిన చోట పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే గండి పూడ్చే పనులను ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ సంస్థకు అప్పగించారు. అయితే పనులు పూర్తికావడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

నాగార్జునసాగర్
నాగార్జునసాగర్
author img

By

Published : Sep 9, 2022, 8:05 PM IST

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ గండి పడిన చోట పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే గండి పూడ్చే పనులను ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ సంస్థకు అప్పగించారు. గండి పూడ్చేందుకు దాదాపు 60 వేల ఇసుక బస్తాలు నింపాల్సి ఉండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు జేసీబీలతో కాల్వకట్ట వద్ద ర్యాంపు వేస్తున్నారు. అయితే పనులు పూర్తికావడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అసలేం జరిగిదంటే: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ముప్పారం సమీపంలో రెండురోజుల క్రితం గండి పడింది. సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతుంది. అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పాటు మట్టికట్ట బలహీనం కావడంతో ఈ గండి పడినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో కాల్వలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అటుగా వచ్చిన రైతులు గండి పడడం చూసి ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు జలాశయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటి విడుదల ఆపేశారు.

అప్పటికే వరదనీటితో నిడమనూరు మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల వరద నీటితో నిండిపోయింది. అందులో ఉన్న 87 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అర్ధరాత్రి వరకు ప్రవాహం స్థానికంగా ఉన్న పలు దుకాణాల్లోకి చేరింది. వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనా ప్రకారం దాదాపు 3వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల్లోని సహాయక చర్యలను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోములభగత్ పరిశీలించారు. వరదల్లో కట్టు బట్టలు తప్ప ఏమీ మిగలలేదని బాధితులు ఆయనకు తెలిపారు. ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. నీటి విడుదలకు ముందే కాల్వ గట్లను పరిశీలించి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగర్ గండి పూడ్చే పనులు వేగవంతం చేసిన అధికారులు.. ఎన్ని రోజులు పడుతుందంటే

ఇవీ చదవండి: సాగర్ గండి పూడ్చేందుకు అడ్డంకిగా మారిన నీటి ప్రవాహం

సాగర్​ ఎడమ కాల్వకు గండి.. విజువల్స్ చూస్తే ఆశ్చర్యపోతారు..

'రూ.41వేల టీషర్ట్​ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్​పై భాజపా సెటైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.