ETV Bharat / state

Sagar Left Canal Farmers Problems : బోరు పోయదు.. కాలువ పారదు.. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు.. ఆవేదనలో అన్నదాతలు - ఈరోజు తెలంగాణ వార్తలు

Sagar Left Canal Farmers Problems : సాగర్ ఎడమ కాలువ కింద పంట సాగు చేస్తున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఖరీఫ్ సీజన్​లో ఆయకట్టు రైతులకు సాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక విడుదల చేయకపోవడం.. ఆరుతడి పంటలను అధికారులు ప్రోత్సహించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో పంటకు నీరందక ఎండిపోతుందని కొందరు రైతులు వాపోగా.. భూములను బీడుగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sagar Left Canal
Sagar Left Canal Farmers Troubles
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 5:13 PM IST

Sagar Left Canal Farmers Problems బోరు పోయదు కాలువ పారదు నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు ఆవేదనలో అన్నదాతలు

Sagar Left Canal Farmers Problems : నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో సాగర్ ఎడమ కాలువ కింద నీళ్లు(NSP Left Canal Farmers Facing Problems) వస్తాయనే ఆశతో రైతులు పంటలు వేశారు. నీటి విడుదలపై ఆయకట్టు రైతులకు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక విడుదల చేయకపోవడం, ఆరుతడి పంటలను ప్రోత్సహించేలా అధికారులు వ్యవహరించకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నీళ్లు లేక ముందుగా వేసిన వరి పొలాలు(Rice Fields) నెర్రెలు బారాయి. పంటలకు నీళ్లు విడుదల చేస్తారనే ఆశతో వరి సాగు చేసిన రైతులు.. వర్షాలు లేక, ఎడమ కాల్వకు నీరు విడుదల చేయక.. నానా తంటాలు పడుతున్నారు. వరి ఎండిపోయి, పెట్టుబడి భారమై నష్టాల బారిన పడ్డామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'నాకు ఐదెకరాల భూమి ఉంది. రెండు ఎకరాలు బోర్ కింద వేశాను. ఆ బోర్ నీళ్లు కూడా పారట్లేదు. మిగతా భూమి అలానే ఉంది. వేసిన పంట ఏమో నీరు లేక ఎండిపోతుంది. ప్రభుత్వ అధికారులు కాలువ నీళ్లు వదిలేలా చూడాలి. బోర్​లు వేసినా నీళ్లు పారక రైతులం చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. వేసిన భూనికైనా నీళ్లు ఇస్తే.. పంట చేతికి వచ్చే అవకాశం ఉంది.-బాధిత రైతు

ఎండుతున్న పంటలు.. నత్తనడకన సాగర్​ ఎడమ కాలువ గండి పనులు

Nagarjuna Sagar Left Canal Farmers Troubles : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనూ సాగర్ ఎడమ కాలువ రైతులు అవస్థలు(Sagar Left Canal Farmers Plight) పడుతున్నారు. వర్షాలు లేకపోవడం, సాగర్ ఆయకట్టుకు నీళ్లు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. వేసిన పంటకు నీళ్లు సరిపడా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చు చేయగా.. ప్రస్తుతం పెట్టుబడి కూడా రాదని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సాగర్‌ ఎడమ కాలువకు నీటిని వదిలి.. పంటసాగుకు సహకరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట సాగుకు తగిన సూచనలివ్వాలని కోరుతున్నారు.

'మేము నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రైతులం. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం చాలా బాధాకరం. చాలా మంది రైతులం నాట్లు వేశాం. బోర్ల ద్వారా నాట్లు వేసిన వాళ్లు.. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ బోర్లలో నీళ్లు ఇంకిపోయాయి. దీంతో రైతాంగం వేసుకున్న పంట దెబ్బతింటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతుల పంటలను కాపాడటానికి నీటిని విడుదల చేయాలని కోరుతున్నాం.' -బాధిత రైతు

Farmers face problems in kyathur : కష్టాల సుడిలో క్యాతూర్​ రైతులు.. నీరు లేక ఎండిపోతున్న పంటలు

Less Flow In Sagar Project : వర్షాలు లేక అడుగంటిన సాగర్‌.. ఎండిన సుంకేసుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.