నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. కరోనా ప్రభావం వల్ల మూతపడ్డ పాఠశాలలు ఎట్టకేలకు పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనల మధ్య 9, 10, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకొచ్చిన విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నారు.
ఆన్లైన్ తరగతుల వల్ల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని... వారికి సరిగ్గా పాఠాలు కూడా అర్థంకాకపోయేవని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్కూల్స్ పునః ప్రారంభం కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఇలా ఉంటే బడి.. అస్సలు మానాలనిపించదు మరి..