యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో కనకదుర్గ ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆలయ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. భువనగిరి- చిట్యాల రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్డీవో, తహసీల్దార్ స్పందించి ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇవీ చూడండి: 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'