ఆర్థిక ఇబ్బందులతో భర్త ఆత్మహత్య చేసుకోవడంతో భార్య బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నాగార్జునసాగర్ హిల్ కాలనీలో నివసించే రవికుమార్ ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. కరోనా కారణంగా ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరగడం వల్ల రవికుమార్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
మనస్తాపం చెందిన రవికుమార్ రెండురోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోవడంతో భార్య అక్కమ్మ... నాగార్జునసాగర్ కుడి కాలువలోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో పిల్లలు దిక్కులేని వారయ్యారు.
ఇదీ చదవండి: ఉపాధిని కబళించిన కరోనా.. ప్రైవేటు ఉపాధ్యాయుడి ఆత్మహత్య