నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా అనుములలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈనెల 14న జరగనున్న సభకు అనుమతి ఇవ్వొద్దని అనుములకు చెందిన రైతులు గోలి సైదిరెడ్డి, గోలి శ్రీనివాస్‌రెడ్డి పిటిషన్ వేశారు.
కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా సభకు తెరాస ఏర్పాట్లు చేస్తోందని హైకోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు లంచ్ మోషన్ పిటిషన్‌గా హైకోర్టు స్వీకరించింది.