నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పోస్ట్ ఆఫీస్ నందు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ... వృద్ధులు రోడ్లపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ల పంపిణీలో అధికారుల అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద పింఛన్ కోసం గంటల తరబడి వేచి ఉన్నా కూడా... పట్టించుకోవడం లేదని వాపోయారు.
వివిధ కారణాలు చెప్తూ... రోజు ఆఫీసుల చుట్టు తిప్పించుకుంటున్నారని తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. ఇదేమని ప్రశ్నించగా ధర్నా చేసుకోమని, మున్సిపాలిటీ ఆఫీస్‌కి వెళ్ళమని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని సమాధానం ఇచ్చారని తెలిపారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ ముట్టడికి సీపీఐ పిలుపు.. పోలీసుల ముందస్తు అరెస్టులు