ETV Bharat / state

సాగర్‌ ఉపఎన్నికలో కోవర్టులపైనే పార్టీల ప్రత్యేక దృష్టి

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కోవర్టులపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. టికెట్ దక్కని అసంతృప్తులు సరిగా పనిచేస్తున్నారా లేదా అనే అనుమానంతో వారిపై నిఘా పెట్టాయి. సొంత పార్టీకి ప్రచారం చేయకపోయినా... ఎదుటి పార్టీకి సహకరించకూడదని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

Parties
కోవర్టులపైనే పార్టీల ప్రత్యేక దృష్టి
author img

By

Published : Apr 9, 2021, 8:57 PM IST

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు ప్రధాన పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన వ్యక్తి ఆయన.. ఎన్నో తర్జనభర్జనల అనంతరం పార్టీ అధిష్ఠానం మరొకరికి టికెట్‌ కేటాయించింది. అప్పటినుంచి ఆ నాయకుడు అంటీముట్టనట్లుగా ఉంటున్నాడు. తనకున్న అసంతృప్తి కారణంగా ఇతర పార్టీకి చెందిన నాయకుడికి సహకరించేందుకు సిద్ధమయ్యాడు.

ఏకంగా ప్రత్యర్థి పార్టీ రాష్ట్ర నేతతో ఫోన్లో మాట్లాడారు. ఇది జరిగిన కాసేపటికే ఇలాంటివి మానుకోవాలని సొంతపార్టీ నుంచి ఆ నేతకు ఫోన్ వచ్చింది. ఇష్టం లేకపోయినా అసంతృప్త నాయకులకు సొంత పార్టీ నేతలతో తిరగక తప్పడం లేదు. ఇలాంటి ఉదాహరణలే ఉప ఎన్నికల్లో సాక్షాత్కరిస్తున్నాయి.

ఓట్లు చేజారకుండా దృష్టి...

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం ఎలాగా అని ఆలోచిస్తున్న పార్టీలు... అంతకుమించి తమ ఓట్లు చేజారకుండా దృష్టిపెట్టాయి. పార్టీలోని అసంతృప్తవాదుల నుంచి ఓటర్లు చేజారకుండా నిరంతర నిఘా పెట్టాయి. అడుగు తీసి అడుగు వేస్తే ఏం చేస్తున్నారనేది... నిమిషాల్లో సొంత పార్టీ నేతలకు తెలిసిపోతోంది.

నిఘా...

మూడు ప్రధాన పార్టీల్లో ప్రచారంలో అన్నింటికన్నా ముందున్న పార్టీ అయితే అన్ని రకాల నిఘాను అసంతృప్త వాదులపై ఉంచింది. ఎవరెవరు ఏం చేస్తున్నారు... ప్రచారంలో సహకరిస్తున్నారా? తమ పార్టీకి ఓట్లు వేసేందుకు క్షేత్రస్థాయి శ్రేణులతో సమన్వయం చేస్తున్నారా? లేదా అనే కోణంలో సదరు నేతల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

అంటీముట్టనట్లు...

ఒకే ఒక్క ప్రధాన పార్టీ మినహా మిగతా రెండు పార్టీల్లో టికెట్ ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారందరినీ సముదాయించిన అధిష్ఠానాలు తప్పని పరిస్థితుల్లో ఇప్పటి అభ్యర్థులను బరిలోకి దింపినట్లు ప్రకటించాయి. టికెట్ దక్కని వారికి భవిష్యత్తులో మంచి పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చాయి. కానీ ఎమ్మెల్యే టికెటే లేకుండా ఇవన్నీ ఎందుకనే ఉద్దేశంతో... ఒక పార్టీలో ఒకరు... మరోపార్టీలో ఇద్దరు ఆశావహులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

కార్యాకలాపాలపై కన్ను...

అందుకే ఆయా పార్టీలు... వీరిని మొదటి నుంచి నిఘా నీడలోనే ఉంచాయి. ఈ రెండు పార్టీల్లోని ముగ్గురు నాయకులు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం వల్ల వీరేమైనా అదే సామాజికవర్గానికి చెందిన అవతలి పార్టీ వ్యక్తికి సహకరిస్తారా అనే అనుమానాలూ ఉన్నాయి. సదరు వ్యక్తులు నియోజకవర్గం మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేరని భావిస్తున్న పార్టీలు... సొంత మండలంలోనైనా ప్రభావం చూపిస్తారేమో అని వారి కార్యకలాపాలపై కన్నేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో పైకి అయితే కచ్చితంగా తమ పార్టీకే సహకరిస్తున్నామన్న సందేశాన్ని ఆయా నాయకులు ఇవ్వాల్సి వస్తోంది. కానీ లోపల మాత్రం ఇంకా అసంతృప్త జ్వాల చల్లారడం లేదు. అందుకే సదరు నాయకులపై అధిష్ఠానాల ఆదేశాల మేరకు... క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా కొనసాగుతోంది.

ఇవీచూడండి: రాష్ట్రానికి మరో టెక్స్‌టైల్ కంపెనీ.. 1100 మందికి ప్రత్యక్ష ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.