నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై ఓ ట్రాక్టర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మాడుగులపల్లి మండలం కన్నెకల్ గ్రామానికి చెందిన ఐకేపీ నిర్వాహకురాలు సౌందర్య ధాన్యం కొనుగోలు అయిపోవడం వల్ల మిగిలిన బస్తాలు, కాంటాలను ట్రాక్టర్లో తీసుకొని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్కు బయలుదేరింది.
మహాతేజ మిల్లు వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ లారీని ఢీకొట్టింది. సౌందర్య కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి