ETV Bharat / state

నల్గొండ జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ - corona updates in nalgonda district

నల్గొండ జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. తిప్పర్తి మండలానికి చెందిన 21 ఏళ్ల యువకుడు కొవిడ్ బారిన పడినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు.

one more corona positive case in nalgonda district
నల్గొండ జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్
author img

By

Published : Jun 1, 2020, 3:10 PM IST

నల్గొండ జిల్లాలో 21 ఏళ్ల యువకుడు కొవిడ్ బారిన పడినట్లు వైద్యాధికారి తెలిపారు. తిప్పర్తి మండలానికి చెందిన యువకుడు యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని తన బంధువు ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత కడుపులో నొప్పితో నల్గొండ ఆసుపత్రికి వెళ్లాడు.

నల్గొండ ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు గుండె కింద నీరు చేరిందని హైదరాబాద్​ వెళ్లాలని సూచించారు. సదరు యువకుడు హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. యువకున్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన అధికారులు అతని కుటుంబ సభ్యులు 16మందికి హోం క్వారంటైన్​ విధించారు.

ఆదివారం రోజు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 24 గంటల్లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.