నల్గొండ జిల్లాలో మరొకరికి కరోనా సోకింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 13కు చేరింది. జిల్లా కేంద్రంలోని మన్యంచెల్క ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళకు కరోనా నిర్ధరణ అయింది. ఆమె కుటుంబ సభ్యుల్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ఇప్పటికే నల్గొండ పట్టణంలో 9 మందికి కొవిడ్ సోకగా.. మన్యంచెల్క, మీర్బాగ్ కాలనీ, రహమత్ నగర్, బర్కత్ పురలను రెడ్జోన్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరో వ్యక్తికి కూడా వ్యాధి సోకడం వల్ల పట్టణంలోనే కరోనా కేసుల సంఖ్య 10కి చేరింది.
దామరచర్లలో ఇద్దరు, మిర్యాలగూడకు చెందిన ఇంకొకరు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67 కేసులు బయటపడగా... అందులో సూర్యాపేట జిల్లాలోనే 54 ఉన్నాయి.
ఇవీచూడండి: కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. లాక్డౌన్పై కీలక చర్చ