ETV Bharat / state

పచ్చదనం పరిఢవిల్లేలా.. ప్రభుత్వ భూముల్లోనే నర్సరీలు

రాష్ట్రంలో పచ్చదనం పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు.. పలుచోట్ల అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు స్థలాల్లో నర్సరీల ఏర్పాటుల వల్ల నష్టపోతున్నామని గుర్తించి.. ప్రభుత్వ స్థలాల్లోనే సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో జిల్లాల్లో వనాల శాతం పెంచేందుకు కృషిచేస్తున్నారు.

Nurseries on government lands
పచ్చదనం పరిఢవిల్లేలా.. ప్రభుత్వ భూముల్లోనే నర్సరీలు
author img

By

Published : Dec 7, 2020, 2:27 PM IST

పచ్చదనం పరిఢవిల్లేలా.. ప్రభుత్వ భూముల్లోనే నర్సరీలు

పచ్చదనం పెంపొందించడానికి మొక్కల సంరక్షణే ప్రథమ కర్తవ్యం. అయితే నర్సరీలు ఎక్కువగా ప్రైవేటు భూముల్లో ఉంటాయి. వీటిలో రక్షణాత్మక చర్యలు కొరవడటం వల్ల.. సగం మొక్కలు కూడా బతకడం లేదు. ప్రభుత్వ సిబ్బందే ఈ సంరక్షణ పద్ధతులు అవలంబిస్తే.. ఒక్క మొక్కా వృథా కాదనే ఆలోచనతో ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు.. ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లోనే నర్సరీలు ఏర్పాటు చేస్తూ మొక్కలు సంరక్షిస్తున్నారు. గ్రామ కంఠం, లేఅవుట్లలో కేటాయించిన 10 శాతం జాగాలు, పల్లె ప్రకృతి వనాలు, బడులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇందుకు ఉపయోగిస్తున్నారు.

సర్కారు భూముల్లోనే...

ఇప్పటివరకూ గ్రామ పంచాయతీ ఆధారంగా సంరక్షణ కేంద్రాలు ఉండగా.. అనుబంధ గ్రామాల్లోకి మొక్కల్ని చేరవేసేవారు. దీనివల్ల వంద మొక్కలు తరలిస్తే అందులో 30 నుంచి 40 వరకు దక్కకుండా పోతున్నట్లు గుర్తించారు. పల్లెల్లోనే ప్రభుత్వ భూముల్లో చేపట్టే నర్సరీల ద్వారా వృథా తగ్గే అవకాశం ఉంది. ఉపాధిహామీ పథకం ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ కింద ఒక్కో నర్సరీకి 45వేలు నిధులు వస్తుండటంతో.. సంరక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించే వీలుంటోంది.

జిల్లాల్లో నర్సరీల శాతం

నల్గొండ జిల్లాలో మొత్తం 844 గ్రామాలకుగాను.. 752 పల్లెల్లో ప్రభుత్వ భూములు గుర్తించారు. నర్సరీల శాతం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 89.09గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామాలకు.. 378 చోట్ల సర్కారీ భూములు తీసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూముల్లో నర్సరీల శాతం 79.57గా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 418 పల్లెల్లో నర్సరీలు ఏర్పాటవుతున్నాయి. అక్కడ ప్రభుత్వ భూముల్లో నర్సరీల శాతం 61.72గా ఉంది. మొత్తంగా మూడు జిల్లాల సగటు చూస్తే.. 80శాతం నర్సరీలు ప్రభుత్వ భూముల్లోనే కొలువుదీరుతున్నాయి. డిసెంబర్‌లోనే వీటిని ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

జిల్లానర్సరీల శాతం
నల్గొండ 89.09%
సూర్యాపేట 79.57%
భువనగిరి 61.72%

ఇవీచూడండి: వరద సాయం అందించపోతే ప్రగతిభవన్​ను ముట్టడిస్తాం: కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.