నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నాయని కుంట తండా గ్రామస్థులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు తండా వాసులపై అక్రమ కేసులు పెట్టి... వారికి ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
తమ పై పెట్టిన కేసులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చుస్తామన్న పోలీసుల భరోసాతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: క్వారంటైన్ సెంటర్లను సందర్శించేందుకు ప్రజలు రావద్దు