నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని నల్గొండ, సూర్యాపేట జిల్లాల వైద్యాధికారులు డాక్టర్ కొండల్రావు, డాక్టర్ హర్షవర్దన్ సందర్శించారు. బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధవనంలోని బుద్ధచరిత వనం, జాతక పార్క్, మహా స్థూపంతోపాటు పలు విభాగాలు సందర్శించారు. వీరితోపాటు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా ఉన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలు వివరించారు.
ఇదీ చూడండి: నివర్ తుపాన్: నెల్లూరు, రాయలసీమకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన