ETV Bharat / state

'కనీసం 17 వేల మెజారిటీతో జానారెడ్డి విజయం సాధిస్తారు' - nagarjuna sagar by poll news

కనీసం 17 వేల మెజారిటీతో జానారెడ్డి విజయం సాధిస్తారని కాంగ్రెస్​ రాష్ట్రవ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ జోస్యం చెప్పారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు.

manikkam tagore
నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ జోస్యం
author img

By

Published : Apr 15, 2021, 2:24 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ జోస్యం

డబ్బు, మద్యం పంచుతూ నాగార్జునసాగర్‌లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్​ రాష్ట్రవ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి కనీసం 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మెజార్టీ పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రలోభాల పర్వాన్ని నియంత్రించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన సాగుతోందని విమర్శించారు. పలువురు కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తూ... తెరాస ఏజెంట్లుగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు.

దుబ్బాకలో భాజపా విజయం నీటి బుడగ లాంటిదన్న ఠాగూర్​... 2018 ఎన్నికల్లో భాజపా 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఇప్పుడు సాగర్​ ఉపఎన్నికల్లోనూ అదే జరగబోతోందన్నారు.

ఇవీచూడండి: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.