నాగార్జునసాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17న సాగర్ ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ... ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు షెడ్యూల్
- ఉపఎన్నికకు ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల
- నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 30 తుదిగడువు
- మార్చి 31న నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 గడువు
- ఏప్రిల్ 17న ఉపఎన్నిక పోలింగ్
- మే 2న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు