ETV Bharat / state

Nagarjuna sagar Political War 2023 : సాగర్​లో.. వారసుల వార్​.. గెలుపు వరించేది ఎవరినో..?

Nagarjuna sagar Political War 2023 : అసెంబ్లీ ఎన్నికల నగారా మోగటంతో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా యువ నాయకుల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్‌ తరపున జైవీర్‌ రెడ్డి బరిలో ఉండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌, బీజేపీ తరపున కంకణాల నివేదిత రెండోసారి తలపడుతున్నారు. నాగార్జునసాగర్‌ రాజకీయాలపై ప్రత్యేక కథనం.

Nagarin sagar Politics
Political Heat in Nagarin sagar
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2023, 8:57 AM IST

Nagarjuna sagar Political War 2023 సాగర్​లో.. వారసుల వార్​.. గెలుపు వరించేది ఎవరినో

Nagarjuna sagar Political War 2023 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలం మంత్రిగా, తెలంగాణ తొలి అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి రికార్డు సృష్టించిన సీనియర్‌ నేత జానారెడ్డికి నాగార్జునసాగర్‌ కంచుకోట లాంటిది. 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 2020లో మృతి చెందటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో నోముల భగత్‌... జానారెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్‌ రెడ్డి పోటీలో నిలిచారు. భగత్‌, జైవీర్‌ ఇద్దరూ యువ నాయకులే కావటం, బలమైన వారసత్వం, క్యాడర్‌ మద్దతు ఉండటంతో పరిస్థితి నువ్వా నేవా అన్నట్లుగా మారింది.

Nomula Bhagat Vs Jaiveer Reddy in Nagarjuna sagar 2023 : నాగార్జునసాగర్‌లో 2018, 2021లో రెండు సార్లు గెలుపొందిన బీఆర్ఎస్.. మరోసారి సత్తా చాటలని భావిస్తోంది. గ్రూప్ తగాదాలు గెలుపు అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇదే అదునుగా కాంగ్రెస్‌ చేరికలను ప్రోత్సహిస్తోంది. అటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గం, నోముల భగత్‌కు ఎంతమేరకు సహకరిస్తోందోనన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించిన నోముల భగత్‌... ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Telangana Election Campaign in Social Media : ఎన్నికల వేళ సోషల్​ మీడియాకు భారీ డిమాండ్​.. పైసా కొడితే క్షణాల్లో లక్షల మంది ఫాలోవర్లు

BRS Vs Congress in Nagarjuna sagar 2023 : మూడేళ్లలో తాను చేసిన అభివృద్ధి, కేసీఆర్ సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా నాగార్జునసాగర్ నుంచే పోటీ చేస్తున్న సీనియర్‌ నేత జానారెడ్డి... ఈసారి తన చిన్న కుమారుడు జైవీర్‌ను బరిలోకి దింపారు. 1978 నుంచి వరుసగా 11 సార్లు పోటీ చేసి 7సార్లు విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు ఓటమి పాలైనా... కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు స్థిరంగానే ఉంది. ఈసారి ఎలాగైన గెలుపు సాధించాలని హస్తం శ్రేణులు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ప్రచార బరిలోకి దిగిన జైవీర్‌... గిరిజన చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Parties Using Helicopters in Telangana Election Campaign : ఎన్నికల్లో విస్తృతమవుతున్న హెలికాప్టర్ల వినియోగం.. ప్రధాన పార్టీలన్నీ తెగ వాడేస్తున్నాయిగా..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, ఆయన భార్య కంకణాల నివేదితా గత రెండు ఎన్నికల నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. 2018లో నివేదిత పోటీ చేసి 2వేల 675 ఓట్లకే పరిమితం అయ్యారు. 2021 ఉప ఎన్నికల్లో గిరిజన నాయకుడు డాక్టర్‌ రవినాయక్‌కు అవకాశం ఇవ్వగా 7 వేల 676 ఓట్లు సాధించారు. ప్రస్తుతం పోటీలో ఉన్న నివేదిత... తమ మార్క్‌ రాజకీయం చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్, కంచుకోటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌, ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్‌లో జెండా ఎగరేసేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల వ్యయంపై నిఘా!

Ticket War in Telangana BJP : బీజేపీలో అసమ్మతి సెగ.. పలుచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతివ్వబోమంటూ కార్యకర్తల అల్టిమేటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.