నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ తెలిపారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉప ఎన్నికల నామినేషన్లు స్వేచ్ఛగా దాఖలు చేయవచ్చని తెలిపారు.
ఈ నెల 23 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చునని... ఏప్రిల్ 3 వరకు ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియకు అన్ని పనులు పూర్తి కావొచ్చాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్