నాగార్జున సాగర్‌కు (NAGARJUNA SAGAR) ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో 4 క్రస్ట్ గేట్లను 5అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు(sagar 4 crust gates opened). ప్రాజెక్టు నుంచి 32,480 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా వదులుతున్నారు. జలాశయం కుడి కాలువ, విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 42 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులోకి 74,496 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 312.04టీఎంసీలకు గాను(tmc)గాను.. 311.74 టీఎంసీ(TMC)లు నిల్వ చేస్తున్నారు.
ఇదీ చూడండి: Sagar gates open: సాగర్‌కు వరద ప్రవాహం.. 4 క్రస్టు గేట్లు ఎత్తివేత