నల్గొండ జిల్లాలో వివాహితపై అత్యాచారం, హత్య(woman was raped and killed) ఘటన బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(MP Uttam Kumar Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి(MP Uttam Kumar Reddy) పరామర్శించారు. వారికి రూ. లక్ష ఆర్థిక సాయంగా అందజేశారు.
పార్టీ తరఫున మృతురాలి(woman was raped and killed) కుటుంబాన్ని ఆదుకుంటామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దుండగులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చేయాలి. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా చలామణి అవుతున్నాయి. మత్తు పదార్థాల విచ్చలవిడి చలామణి వల్లే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టాలి. -ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ
వాటిని అరికట్టాలి
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఉత్తమ్(MP Uttam Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ఈ అఘాయిత్యానికి(woman was raped and killed) పాల్పడిన వారిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా చలామణీ అవుతున్నాయన్న ఉత్తమ్(MP Uttam Kumar Reddy).. వాటిని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోందని.. వాటిని నిర్మూలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దారుణంగా చంపేశారు
ఈ నెల 22న ఓ వివాహితపై ఇద్దరు అత్యాచారాని(woman was raped and killed)కి పాల్పడి.. ఆపై ఆమె తల నేలకేసి కొట్టి హతమార్చారు. నిందితులిద్దరిలో ఒకరు.. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు. మరోవ్యక్తి.. భార్యతో గొడవపడి ఒంటరిగా ఉంటున్నాడు.
నల్గొండ మండలంలో ఓ గ్రామానికి చెందిన వివాహిత (54) భర్తతో కలిసి గ్రామంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహమైంది. ఆమె బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి దుకాణానికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, అతడి స్నేహితుడు కుమ్మరి పుల్లయ్య అటకాయించారు. నోరు మూసి లింగయ్య ఇంట్లోకి లాక్కెళ్లారు. వివస్త్రను చేశారు. దాడి చేసి అత్యాచారాని(woman was raped and killed)కి పాల్పడ్డారు. అనంతరం తలను నేలకేసి కొట్టి.. పిడిగుద్దులు గుద్ది ఆమెను హతమార్చారు. మెడలోని బంగారు గొలుసు, గాజులు, చెవి కమ్మలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు.
woman was raped and killed : అత్యాచారం చేసి.. తల నేలకేసి కొట్టి చంపేశారు
ఇద్దరూ 40 ఏళ్ల లోపే
గొడవ జరుగుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడికి వచ్చి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులిద్దరూ 40 ఏళ్ల లోపు వారు. వినాయక నిమజ్జనం జరిగిన ఆదివారం నుంచి మద్యం తాగి గ్రామంలో జులాయిగా తిరుగుతున్నారని పోలీసులకు గ్రామస్థులు తెలిపారు. రెండేళ్ల నుంచి కాపురంలో గొడవలు రావడంతో లింగయ్య భార్య కొంత కాలంగా పుట్టింట్లో ఉంటున్నారు. కుమ్మరి పుల్లయ్య.. భార్యను ఏడేళ్ల క్రితం హత్య చేసి నెల రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చాడు.
ఇదీ చదవండి: bandi sanjay letter to kcr: మంత్రివర్గంలో వారికి అవకాశమివ్వాల్సిందే.. కేసీఆర్కు బండి సంజయ్ లేఖ