నదీ జలాల విషయంలో రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అసమర్థతే కారణమని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (MP UTTAM KUMAR REDDY) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల పనులు కొనసాగుతుండగా.. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు మాత్రం అనుమతులు తెచ్చుకోవాలని నోటిఫికేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఏడేళ్లైనా పాత ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడం... ప్రభుత్వ చేతగాని తనమే అని విమర్శించారు. దీనిపై మరో ఎంపీ కోమటిరెడ్డితో (MP KOMATIREDDY VENKAT REDDY)కలిసి పార్లమెంటులో పోరాడతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఉపఎన్నికలు గుర్తుకు వచ్చినప్పుడే ముఖ్యమంత్రికి అభివృద్ధి గుర్తుకు వస్తుందని.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.
కేవలం ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రానికి కేంద్రం వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రానికి నష్టం కలిగేలా నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందంటే... ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్లే ఇచ్చారు. ఈ కృష్ణా గోదావరి బోర్డుల నిర్వహణ తీరుపై సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావాలి. ఏడేళ్లు పూర్తయినా ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదు. నదీ జలాల వివాదంపై పార్లమెంటులో నేను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి పోరాడతాం.
-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ.
ముఖ్యమంత్రికి ఉపఎన్నికలు అన్నప్పుడే అభివృద్ధి గుర్తుకు వస్తుంది. భువనగిరిలో కూడా ఉప ఎన్నికలు వస్తే.. మస్తు పైసలు వస్తాయి.
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ.