నల్గొండ జిల్లావ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు,వాగులు అలుగు పోస్తున్నాయి. వరి పొలాలు అనుకూలంగా ఉన్నప్పటికీ పత్తి చేళ్లకు మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు రైతులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి చేళ్ళు మాత్రం రోగాల బారిన పడక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆనందం
గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అలాగే ఖరీఫ్ పంటలకు ఇబ్బందులు లేవని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కరోనా.. మరోవైపు విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు చిరువ్యాపారులు చింతిస్తున్నారు.
రోడ్లపై ఇబ్బందులు
గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. వ్యాపారులు, ఉద్యోగులు తమ పనుల నిమిత్తం రోడ్లపై వెళ్లాలంటే నానా ఇబ్బందులూ పడుతున్నారు. కరోనా పరీక్షలకు నిమిత్తం ఆసుపత్రికి వచ్చే బాధితులకు కష్టాలు తప్పడంలేదు. పరీక్షలు దగ్గరకు వచ్చే బాధితులు వర్షంలోనే నిల్చొని పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఇదీచూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం