నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పర్యటించారు. మండల కేంద్రలోని నాలుగో వార్డులో పది లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. చెత్త సేకరణ బుట్టలు పంపిణీ చేశారు.
ఇళ్లలోని తడి, పొడి చెత్తలను వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్లకు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఇవీచూడండి: మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు