కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చండూర్, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని పేదలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు తమ వంతుగా సాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవాలంటే స్వీయ నియంత్రణ పాటిస్తూ, ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి