నల్గొండలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పర్యటించారు. ఎమర్జెన్సీ, డయాలసిస్, సీజనల్ వార్డులోని రోగుల ఇబ్బందులు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని వార్డుల్లో రోగులు అధికంగా ఉండి బెడ్లు సరిపోవడంలేదని సిబ్బంది పేర్కొన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: నాణేలు, నారింజలు, కాగితాలు... గణేశుడికి కాదేదీ అనర్హం!