నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో 76 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి మాడుగుల పల్లి, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన 76మంది లబ్ధిదారులకు రూ.25,41,500లు సీఎం సహాయనిది నుంచి మంజూరు కాగా, నేడు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా వ్యాధిని చూసి ఎవరూ భయపడవద్దని, మాస్కులు, శానిటైజర్లు వాడుతూ, భౌతిక దూరం పాటించాలని అన్నారు. తగిన జాగ్రత్తలతో కరోనాను దూరం చేయవచ్చని తెలిపారు. కరోనా బారిన పడిన వారు వైద్యుల సూచన మేరకు చికిత్స పొందాలని.. మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని, అప్పుడే కరోనాను జయించగలమని అన్నారు.
ఇవీ చూడండి: 'కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'