ETV Bharat / state

నకిరేకల్ తెరాసలో అంతర్గత పోరు.. బరిలో 14 మంది రెబల్స్

author img

By

Published : Apr 27, 2021, 11:11 AM IST

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో అధికార తెరాసకు తిరుగుబాటు బెడద పట్టుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు కంటే తిరుగుబాటు దారుల నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. మంత్రి జగదీశ్ రెడ్డి రెండు వర్గాలను సమన్వయం చేసే పనిచేసినా... ఫలితం దక్కలేదు. నకిరేకల్ పురపాలికలో మొత్తం 20 వార్డులకుగానూ 14 మంది తిరుగుబాటుదారులు బరిలో తల పడటం సవాల్​గా మారింది.

election
election

నకిరేకల్ పురపోరులో తెరాసకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కారు దూసుకుపోతుండగా... నకిరేకల్ పురపోరులో సొంత పార్టీ తిరుగుబాటు దారుల నుంచి ఇక్కట్లను ఎదుర్కొంటుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య ఎంతకీ సఖ్యత కుదరడం లేదు. మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరు నేతల మధ్య రాజీ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపలిటీగా ఏర్పాడ్డాక వచ్చిన తొలి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయా పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

నకిరేకల్ పట్టణంతో పాటు సమీపంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. మొత్తం 21 వేలకు పైచిలుకు ఓటర్లున్నారు. పరోక్ష ఎన్నికలు కావడం వల్ల ప్రధాన పార్టీలు మెజార్టీ వార్డులు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ పురపాలికలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిసిన చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరారు. పలువురు కాంగెస్ నాయకులు తెరాస కండువా కప్పుకున్నారు. అధికార తెరాస బలం మరింతగా పెరిగింది.

తలనొప్పిగా మారిన వ్యవహారం…

గత అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డ చిరుమర్తి లింగయ్య , వేముల వీరేశం ఒకే జెండా కింద ఉన్నా కలిసి పని చేయడం లేదు. ఇద్దరి వ్యవహారం తలనొప్పిగా మారింది. తెరాసలో నెలకొన్న వర్గపోరు, తొలిసారి జరుగుతున్న పురపోరులో విజయం దక్కించుకునేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధి తెరాసతోనే సాధ్యం అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటేయాలంటూ కోరుతున్నారు.

బరిలో 14 మంది రెబల్స్…

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య అధికార పార్టీలో చేరినప్పటికీ... ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో సఖ్యత కరవైంది. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఇరువర్గాల మధ్య గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. తొలి మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని అటు ఎమ్మెల్యే చిరుమర్తి ఇటు మాజీ ఎమ్మెల్యే వీరేశం పట్టుదలకు పోయారు. తాను సూచించిన 10 మంది అనుచరులకు కౌన్సిలర్ టికెట్లు ఇవ్వాలని వీరేశం అడిగినా... ఎమ్మెల్యే చిరుమర్తి ససేమిరా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం 20 వార్డుల్లో ఎమ్మెల్యే చిరుమర్తి తన అనుచరులను బరిలో నిలిపారు.

ఎమ్మెల్యే పక్షాన అధిష్ఠానం…

తెరాస అధిష్టానం ఎమ్మెల్యే లింగయ్య పక్షాన నిలిచింది. చిరుమర్తి సూచించిన అభ్యర్థులకు బీఫాం అందించారు. వీరేశం అనుచరులు 14 వార్డుల్లో పోటీకి దిగారు. అందరికి ఒకే గుర్తు వచ్చేలా వ్యూహాత్మకంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్... సింహం గుర్తుపై పోటీకి దిగారు. పట్టణంలో పోటాపోటీగా ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పరిస్థితిని గమనించిన మంత్రి జగదీశ్ రెడ్డి స్థానికంగా ఉంటూ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరేశం పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ఎక్కడ దొరకకుండా జాగ్రత్తపడ్డారు. వీరేశం వ్యవహారంపై ఎమ్మెల్యే లింగయ్య బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. వీరేశం ముసుగు కప్పుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సత్తా చూపిస్తాం…

గత పంచాయతీ ఎన్నికల్లో తెరాస ఎమ్మెల్యేగా వీరేశం ఉన్నప్పటికీ నకిరేకల్​లో కాంగ్రెస్ సర్పంచ్ పదవి దక్కించుకుంది. తెరాస మెజారిటీ వార్డులు గెలిచినా సర్పంచ్ పదవి గెలుచుకోలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల కంటే సొంత పార్టీ అభ్యర్థుల నుంచే తెరాసకు గట్టి పోటీ ఎదురవుతోంది. మొదటి నుంచి తెలంగాణ జెండా పట్టుకున్న తమకు అన్యాయం జరిగిందని తెరాస తిరుగుబాటు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపిస్తామని చెబుతున్నారు.

ఇరు వర్గాలను నొప్పించకుండా మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఎవరు ఎన్ని సీట్లు దక్కించుకుంటారో తెలియని స్థితిలో తిరుగుబాటుదారులను ఒక్క మాటకూడా అనడంలేదు. ఎన్నికల ఫలితాల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.