ETV Bharat / state

హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే

హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే మొక్కలను ప్రజలందరూ సంరక్షించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు పేర్కొన్నారు. ఆరో విడత హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

Miryalaguda MLA Bhasker rao participated Harithaharam programme
హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి
author img

By

Published : Jun 25, 2020, 8:20 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కరరావు ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణలో అడవులను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ఒక్క దామరచెర్ల మండలంలోనే 3 లక్షల వరకూ మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

గ్రామాల్లో సర్పంచులకు మొక్కల బాధ్యతలను అప్పగించినట్లు వెల్లడించారు. 85% మొక్కలను రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. రాష్ట్రం పచ్చని చెట్లతో నిండాలంటే ప్రజలందరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.