తెరాస పాలనపై అసంబద్ధ ఆరోపణలతో విపక్షాలు పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని... మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. ఆరేళ్ల పాలనలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత... తమదేనని అన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ కార్యక్రమానికి... మంత్రులు హాజరయ్యారు.
భాజపా పాలనలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా... ఉన్న కొలువులు ఊడగొడుతున్నారని మంత్రులు మండిపడ్డారు. కేవలం 1000 ఉద్యోగాలైనా ఇవ్వలేని భాజపా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్‌కు ముందు నల్గొండ లక్ష్మీ గార్డెన్స్ నుంచి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ వరకు.. తెరాస నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 6,7,8 తరగతులు