ETV Bharat / state

సీఎంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ ఫలితం: జగదీశ్​ రెడ్డి - విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి వార్తలు

సీఎం కేసీఆర్​పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నాగార్జున సాగర్​ ఫలితమే నిదర్శనమని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంట నడుస్తోందని చెప్పారు.

minister jagadeesh reddy
జగదీశ్​ రెడ్డి
author img

By

Published : May 2, 2021, 7:42 PM IST

తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంట నడుస్తోందని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. ఇందుకు నాగార్జున సాగర్​ ఫలితమే నిదర్శనమన్నారు. తెరాస అభ్యర్థి నోముల భగత్​ను గెలిపించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్​ను భాజపా, కాంగ్రెస్ వాళ్లు సభ్యత లేకుండా మాట్లాడారని.. దుబ్బాక ఒక్కటి గెలిచిన కాషాయం పార్టీ వారు ఎగిరి పడ్డారని విమర్శించారు.

సాగర్​లో జానారెడ్డి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాలెంజ్ చేశారని... మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్​కు మతిస్థిమితం లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు అయిందన్నారు.

ఇదీ చదవండి: పక్కా వ్యూహం.. ప్రణాళిక ప్రకారం ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.