నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. భారీ వర్షాల వల్ల అమ్మనబోలులో కొట్టుకుపోయిన మూసీ కాలువ వంతెనను పరిశీలించారు. వంతెన లేకపోవడం వల్ల మోత్కూర్ నుంచి నార్కెట్పల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నల్గొండ-యాదాద్రి జిల్లాలను కలిపే దారి కావడం వల్ల తక్షణమే తాత్కాలిక రహదారి నిర్మించి రాకపోకలు పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆదేశించారు. విపత్తు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా.. శాశ్వత పరిష్కారంగా.. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.