రైతు శ్రేయస్సు కోసమే పనిచేసే ప్రభుత్వం అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన వానకాలం నియంత్రిత సాగు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారని, రైతులు తాము పండించిన పంటకు ధరను నిర్ణయించే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో నియంత్రిత సాగు విధానాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని వివరించారు.
అందరూ ఒకే పంట వేయకుండా డిమాండ్ ఉన్న వివిధ పంటలు వేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. మెట్ట ప్రాంత రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు వైపు ముగ్గు చూపరాదన్నారు. కంది సాగుతో పాటు అంతర పంటలు వేసి లాభాలు పొందవచ్చని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక క్లస్టర్‌ను దత్తత తీసుకొని నియంత్రిత సాగు ద్వారా రైతులకు లాభం వచ్చేలా వ్యవసాయం చేపిస్తానని మంత్రి తెలిపారు.