వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చిన వలస కూలీలను లాక్డౌన్ కారణంగా అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద క్వారంటైన్లో ఉంచారు. వలస కూలీల తరలింపునకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు... నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ బీసీ ఉన్నత పాఠశాలలో ఆశ్రయం పొందిన వారికి పరీక్షలు నిర్వహించి సొంతూళ్లకు పంపారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో 150 మందికి వసతి కల్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన 98 మంది, గుంటూరుకు చెందిన 48 మంది, కడప జిల్లా వాసులు నలుగురు, ఇద్దరు నెల్లూరు వాసులకు ఆరోగ్య పరీక్షలు చేసి, క్వారంటైన్ ముద్రలు వేసి ఇంటికి పంపారు.
ఇదీ చూడండి: 'గిరిజన హక్కులు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం'