ETV Bharat / state

Dengue Fevers in Nalgonda : ఊరంతా విషజ్వరాలే... లక్షలు ఖర్చుచేసినా...

Dengue Fevers in Nalgonda : ఆ గ్రామ జనాభా 400. అందులో 100 మందికి పైగా డెంగీ, విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కొందరు కోలుకుంటుండగా.. మరికొంత మంది ఇప్పటికీ ప్రైవేటు దవాఖానాల్లో లక్షలు గుమ్మరిస్తున్నారు. చికిత్స కోసం గ్రామస్తులు ఇప్పటికే కోటి వరకు ఖర్చు చేశారు. నల్గొండ జిల్లా తిప్పలమ్మగూడెంలో విషజ్వరాల విజృంభణపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Dengue Fevers in thipparthi
Dengue Fevers in thipparthi
author img

By

Published : Mar 16, 2022, 1:10 PM IST

Dengue Fevers : ఊరంతా విషజ్వరాలే... లక్షలు ఖర్చుచేసినా...

Dengue Fevers in Nalgonda : నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెంలో కొంతకాలంగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు విషజ్వరాలతో బాధపడుతున్నారు. వారంతా నల్గొండకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. మాములు జ్వరమని సమీపంలోని మిర్యాలగూడ, నల్గొండలోని ఆసుపత్రులకు వెళ్తే డెంగీ వచ్చిందని వైద్యులు నిర్ధారిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే వేలకువేలు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఇంటిల్లిపాదికీ జ్వరం సోకడంతో లక్షకు పైగా ఖర్చుచేసి ఆర్థికంగా చతికిలపడ్డారు.

పంచాయతీ పట్టించుకోలే...!

గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణను పట్టించుకోకపోవడంతో విషజ్వరాలు సోకుతున్నాయని వైద్యుల ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో ఇదేపంచాయతీ ఆవాసమైన నూకలవారి గూడెంలోనూ పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదైనా... గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్య బృందం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారిదేనని సర్పంచ్‌ చెబుతున్నారు.

డెంగీగా చిత్రీకరిస్తున్నారు..!

ఐదురోజుల క్రితం వైద్యబృందం గ్రామంలో శిబిరం నిర్వహించి అన్ని ఇళ్లను పరిశీలించగా... 20 డెంగీ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది. కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు.. ఎక్కువ డబ్బులు గుంజేందుకు సాధారణ జ్వరాలనూ డెంగీగా చిత్రీకరిస్తున్నారన్నారని మండల వైద్యాధికారులు చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరాలను నియంత్రిస్తామని పేర్కొంటున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు ప్రజలు పరుగులు పెట్టొద్దని... ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. సరైన చికిత్స అందిస్తారని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీచూడండి: Love Medicine : ప్రేమను పుట్టించడానికీ మందులా...? వాడితే....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.