తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ బీసీ కమిటీ ఎంపిక జరిగింది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడిగా
నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన మండవ నర్సయ్యను నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నెల్లూరు దుర్గాప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలో, పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మండవ నర్సయ్య తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని జిల్లా వ్యాప్తంగా బీసీలను ఏకం చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల