నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీ తరపున పోటీలో ఉండడం ఖాయమని ఎమ్మాఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు డబ్బు, మద్యం పంచకుండా ఉంటాయా అని ఆ పార్టీలకు సవాలు విసిరారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ్ విహార్‌లో.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత సాధనకు ఎమ్మాఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. అధికారంలోని తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు ఎన్నికల నియమాలు పాటించి నీతినిజాయితీతో పోటీ చేస్తామని ప్రమాణం చేయగలయా అని ప్రశ్నించారు.
మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ 26ఏళ్ళుగా ఉద్యమం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కులాల్లోని పేదలకు ఏమి చేసిందో చెప్పి మరీ సాగర్ ఉప ఎన్నికలో ఓటు అడగుతుంది. ఆ మూడు పార్టీలూ ఇప్పటి వరకు ఏం చేశాయి. ఇంకేంచేస్తాయో చెప్పీ ఓట్లు అడగాలి.
-మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు
ఇదీ చూడండి: రసవత్తరంగా మారుతున్న ఖమ్మం బల్దియా పోరు