ETV Bharat / state

అంధకారంలోకి నెట్టిన ప్రమాదం.. ఆసరా కోసం ఎదురుచూపులు - handicapped needs help in nalgonda

చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. తన బాగోగులు చూసుకునే వారెవరూ లేరు. అయినా ధైర్యం చెడిపోలేదు. బంధువుల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తూ జీవనం సాగించాడు. వారి సహకారంతోనే ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. చిన్నతనం నుంచి ఒంటరిగా జీవించిన తన జీవితంలోకి భార్య రాక వేయిదీపాల కాంతిని తీసుకొచ్చింది. ఎంతో సంతోషంగా గడుపుతున్న అతని జీవితాన్ని ఓ ప్రమాదం చీకటికూపంలోకి నెట్టింది.

అంధకారంలోకి నెట్టిన ప్రమాదం
అంధకారంలోకి నెట్టిన ప్రమాదం
author img

By

Published : Oct 1, 2021, 11:31 AM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శాంతి నగర్​కు చెందిన మాదాల సురేశ్.. తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు. అప్పటినుంచి బంధువుల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం జీవిత అనే యువతితో వివాహం జరిగింది. ఆమెతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం బయటకు వెళ్లేందుకు ద్విచక్రవాహనాన్ని తీస్తుంటే అదుపు తప్పి అది సురేశ్​పై పడింది.

ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. తన భార్య జీవిత తో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం షాపు నుంచి ఇంటికి వస్తుండగా అదుపు తప్పి ద్విచక్రవాహనంపై నుంచి సురేశ్ కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకువెళ్తే అతడి రెండు తొంటి ఎముకలు విరిగాయని శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. సుమారు రూ.5 లక్షల అప్పు చేసి మరీ అతనికి వైద్యం చేయించారు. సురేశ్ కోలుకోవడానికి దాదాపు సంవత్సరంపైగా సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. అప్పటికీ కోలుకోకపోతే మరో శస్త్రచికిత్స చేయాలని అన్నారు.

ఇంట్లో పనిచేసే ఒక్కడు మంచాన పడటం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భర్త మంచాన పడటం వల్ల జీవిత కూలీ పనికి వెళ్తూ బతుకు బండిని లాగుతోంది. తనకు వచ్చే కూలీ ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదని భర్త మందుల ఖర్చులు మోయలేని భారంగా మారాయని వాపోతోంది.

"నా భర్త బైక్​పై నుంచి కిందపడ్డాడు. చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు అయింది. ఆ డబ్బు అప్పు చేసి కట్టాం. కానీ నాకు వచ్చే రూ.4వేల జీతంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. మా ఆయన మందులకు నెలకు రూ.30వేలు ఖర్చు అవుతోంది. అంత డబ్బు నేను ఎక్కడినుంచి తీసుకురాగలను. మందులు వేసుకుంటేనే తను త్వరగా కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. కానీ అంత డబ్బు పెట్టి మందులు కొనే పరిస్థితులో మేం లేము. ప్రభుత్వం స్పందించి మా మీద దయతలిచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి. అలాగే మా ఇద్దరిలో ఎవరికైనా పింఛను ఇవ్వాలి."

- జీవిత. బాధితుడి భార్య

"నా వైద్యానికే రూ. 5 లక్షలు ఖర్చయిందని. ప్రతినెల రూ.30వేలు మందులకు ఖర్చవుతోంది. ఆపరేషన్​ కోసం చేసిన అప్పు తీర్చడానికి సీఎం రిలీఫ్ ఫండ్​కు దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటి వరకు అక్కణ్నుంచి ఒక్క రూపాయి రాలేదు. నాకు తిండి పెట్టడానికే నా భార్య అష్టకష్టాలు పడుతోంది. మా అత్తమ్మ కూడా నెల ఖర్చులు కొంత సమకూరుస్తోంది. కానీ ఎన్నిరోజులని ఒకరిపై ఆధారపడగలం. ప్రభుత్వం, అధికారులు స్పందించి మాకు ఓ దారి చూపించాలి. దాతలు మాకు సాయం చేయడానికి ముందుకు రావాలి."

- సురేశ్, బాధితుడు

వారి పరిస్థితి చూసిన స్థానికులు.. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి వారికి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.