ETV Bharat / state

ఇందిరమ్మపై హాస్యాస్పద వ్యాఖ్యలా అంటూ కేసీఆర్​పై ఖర్గే ఫైర్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Mallikarjun kharge Election Campaign in Nalgonda : ప్రశ్న పత్రాలు లీక్‌ కావడమే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దిల్లీలో ఉన్న మోదీ.. ఫామ్‌హౌస్‌లో కూర్చున్న కేసీఆర్ ఇద్దరు ఒక్కటే అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అలంపూర్, నల్గొండలో భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కుంభకోణాల్లో మునిగిపోయారన్నారు. నల్గొండలో 12 కు 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

Congress Election Campaign in Telangana
Mallikarjun kharge Election Campaign in Nalgonda
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 9:12 PM IST

Mallikarjun kharge Election Campaign in Nalgonda : ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. యావత్ రాష్ట్ర ప్రజలు ఏకమై అహంకార ధోరణితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను(CM KCR) గద్దె దించాలన్నారు. మోదీ.. కేసీఆర్ ఇద్దరికి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయన్నారు. మోదీ, కేసీఆర్‌కు పేద ప్రజల కష్టాలు తెలియదని.. పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు.

ఇందిరమ్మ వంటి మహా నాయకురాలను కూడా కేసీఆర్ దూసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ గొప్ప ప్రాజెక్టును ఇందిరాగాంధీ హయాంలోనే కట్టించారన్నారు. సాగర్ కట్టకపోతే తెలంగాణ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. సోనియాగాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ అవినీతి మయంగా మార్చన్నారు.

కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి

ధనికులైనా, పేదలైనా.. వెనుకబడిన వర్గాలైనా, దళితులైనా ఎవరు కూడా ఆకలి కడుపుతో చనిపోవద్దని ఇందిరాగాంధీ.. గరీబీ హఠావో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కానీ కేసీఆర్ ఆమె గురించి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఇందిరా గాంధీ ఎక్కడ.. కేసీఆర్ ఎక్కడ. డబ్బు కోసమే కేసీఆర్ పాలన చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయారు. హైదరాబాద్‌ను వదిలి ఫామ్‌హౌస్‌ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఈ వ్యక్తి మీకు కావాలా? మరోసారి కేసీఆర్ అధికారంలో కొనసాగాలని మీరు అనుకుంటున్నారా? -మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

Congress Election Campaign in Telangana : తెలంగాణలో ప్రతి పౌరుడిపై లక్ష 40 వేలు అప్పు ఉందన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఏనాడు ప్రధాని(Prime Minister) పదవి కోసం పాకులాడలేదన్నారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తి చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోందని.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు కలసి పోరాటం చేస్తున్నారన్నారు.

కేసీఆర్​పై ఖర్గే ఫైర్..: కేసీఆర్‌ని ఫామ్‌హౌస్‌కి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. అధికారంలోకి రాగానే.. కేబినెట్‌లో మొట్టమొదటి సంతకం ఆరు గ్యారెంటీలపైనే ఉంటుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్‌ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) చేశారని.. కేసీఆర్, మోదీ కనీసం 500 కిలోమీటర్ల నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుంటే బాగుటుందన్నారు.

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడారని నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను బంద్ చేశారని ఆరోపించారు. నల్గొండలో బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించిన మల్లికార్జున ఖర్గే.. 12 కి 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇందిరమ్మపై హాస్యాస్పద వ్యాఖ్యలా అంటూ కేసీఆర్​పై ఖర్గే ఫైర్

జోరందుకున్న కాంగ్రెస్​ ప్రచారం - ​ ఆ 18 నియోజకవర్గాలపైనే ప్రధాన ఫోకస్

80 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు-తప్పదు భారీ మెజార్టీ : భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.