ETV Bharat / state

సాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో అతిరథమహారథులు

author img

By

Published : Apr 1, 2021, 10:27 AM IST

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్‌ రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ నెల 17న పోలింగ్‌ జరుగుతుండగా.. ఈ నెల 15 ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రచారానికి చివరి రోజు 15న లేదంటే 14వ తేదీన నియోజకవర్గంలో సీఎం సభ ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

nagarjuna sagar, nagarjuna sagar campaign
నాగార్జునసాగర్ ఉపఎన్నిక, సాగర్ ఉపఎన్నిక

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి రోజు 15న లేదా 14న నియోజకవర్గంలో కేసీఆర్ సభ ఉండనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10న ఉమ్మడి ‘నల్గొండ జిల్లా కృతజ్ఞత సభ’ను హాలియాలో నిర్వహించారు. ఈ సభను కూడా హాలియాలో నిర్వహించాలా లేదా ఇతర ప్రాంతంలోనా అన్న దానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.

మంత్రి కేటీఆర్ రోడ్​షో

మరోవైపు మంత్రి కేటీఆర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో ఉండనుంది. తొలుత ఈ నెల 6 తర్వాత తొలి దశ రోడ్‌షో ఉండనుండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశలో మరోసారి ఉంటుందని తెలిసింది.

కాంగ్రెస్ ముఖ్యనేతల ప్రచారం

కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు రోడ్‌షోలో పాల్గొననున్నారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ వెల్లడించారు.

భాజపా స్టార్ క్యాంపెనర్లు

భాజపా నుంచి స్టార్‌ క్యాంపెనర్లుగా ప్రకటించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయధ్యక్షుడు లక్ష్మణ్‌, విజయశాంతి తదితరులు రానున్నారు. ఎవరెవరూ ఎప్పుడు పర్యటించేది ఒకట్రెండు రోజుల్లో ఖరారవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.