నిండుకుండలా సాగర్..
నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండల మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి సాగర్‌కు 2 లక్షల 13 వేల 028 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగులుగా ఉంది.
పూర్థిస్థాయి నీటిమట్టం...
312.04 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 311.14 టీఎంసీలకు చేరుకుంది. ఫలితంగా సాగర్‌లో పూర్థిస్థాయి నీటిమట్టం ఉంది. గేట్లు ఎత్తడంతో 25 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా, 7 వేల 878 క్యూసెక్కుల నీరు కుడి కాల్వకు,1800 క్యూసెక్కుల నీరు ఎస్ఎల్బీసీకి మొత్తం కలిపి సాగర్ నుంచి 1,00,300 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లోగా వెళ్తోంది.
ఇప్పటికే మూడు సార్లు గేట్లు ఎత్తివేత..
నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను గత నెల నుంచి నేటికి 3 సార్లు ఎత్తారు. ఇదే వరద కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి : కలిసి సేవలందించనున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు!