వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. దుర్బుద్ధితో దోచుకునేందుకు కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినవారే పార్టీ స్థాపిస్తున్నారన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకే కొన్ని శక్తుల ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణను అస్థిరపరిచే శక్తులకు రాష్ట్రంలో స్థానం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో గడీల పాలన లేదని... ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతోందని మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు. కులాలు, మతాల పేరిట రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు