ETV Bharat / state

అన్ని భాషల్లాగే హిందీ కూడా​.. అంతే తప్ప బలవంతంగా రుద్దొద్దు: కేటీఆర్ - రాజగోపాల్​ రెడ్డిపై ఆరోపణలు

KTR on bjp government: మంత్రి కేటీఆర్​​ ట్విటర్​ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు.హిందీ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. మనకంటూ జాతీయ భాష లేదన్న మంత్రి.. అన్ని భాషల్లాగే హిందీ కూడా ఓ అధికారిక భాష మాత్రమేనని స్పష్టం చేశారు.

KTR
KTR
author img

By

Published : Oct 12, 2022, 11:30 AM IST

Updated : Oct 12, 2022, 4:46 PM IST

KTR on bjp government: ఐఐటీతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఇప్పటి వరకు జాతీయ భాష అంటూ ఏదీ లేదని.. చాలా అధికారిక భాషల్లాగే హిందీ సైతం ఓ అధికారిక భాషేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. భాషను ఎంచుకునే హక్కు భారతీయులకు ఉండాలన్నారు. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో హిందీ భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

  • India does NOT have a National language & Hindi is one among the many official languages

    To impose Hindi by way of mandating in IITs & central Govt recruitments, NDA Govt is flouting the federal spirit

    Indians should have a choice of language & we say No to #HindiImposition pic.twitter.com/IwXDPNSoSO

    — KTR (@KTRTRS) October 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను దేశం మొత్తానికి ఆపాదించాలనుకోవటం ఎంతవరకు సబబు?: కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ప్రజలపై హిందీ భాషను రుద్దాలనుకుంటోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ లేఖ రాసినట్లు ఆయన ప్రకటించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు గల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలన్న హోంమంత్రి అమిత్​షా సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ అన్ అఫీషియల్ లాంగ్వేజెస్ నివేదికను మంత్రి తప్పుబట్టారు. కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను దేశం మొత్తానికి ఆపాదించాలనుకోవటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదన్న మంత్రి.. ప్రపంచ స్థాయి సంస్థలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, మల్టీనేషనల్ కంపెనీల్లో మన యువత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదవడమే కారణమన్నారు. మోదీ సర్కారు హిందీ భాషకు అనవసర ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తోందని విమర్శించారు. అన్ని స్థాయిల్లో హిందీ భాషను కచ్చితం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

రాజ్యాంగ హక్కుని కాలరాస్తున్నారు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలు హిందీ మీడియంలో ఉండటాన్ని సైతం మంత్రి తప్పుబట్టారు. కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ నిర్ణయం కాలరాస్తుందని తెలిపారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఇంగ్లీష్, హిందీలకే ప్రాధాన్యత ఇచ్చి తన చిత్తశుద్దిలోని డొల్లతనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.

ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ పరీక్షలు నిర్వహించాలి: ఇది కేవలం 12 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదన్న కేటీఆర్, మాతృ భాషలో చదువుకున్న కోట్లాది మంది ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని మార్చుకుని భవిష్యత్తులోనూ అన్ని ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యం ఇస్తామన్నా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతంలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికీ కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు

    రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు

    గుజరాత్ కు గత ఐదు నెలల్లో ₹80,000 కోట్ల ప్యాకేజీలు. మా తెలంగాణకు కనీసం ₹18,000 కోట్లు ఇవ్వలేరా?

భాజపాకి సవాల్​ విసిరిన కేటీఆర్​: మరోవైపు కేంద్రం.. నల్గొండ జిల్లాకు రూ.18వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస పోటీ నుంచి తప్పుకుంటుందని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. నీతి ఆయోగ్, ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి రూ.19వేల కోట్ల రూపాయలను కేటాయించమని కేంద్రానికి సిఫార్సు చేస్తే.. కేంద్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు.

భాజపా రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ.18వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోదీ నల్గొండ జిల్లాకు రూ.18వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తే పోటీనుంచి తప్పుకుంటామని.. అందుకు భాజపా సిద్దమా అని ఆయన సవాల్​ విసిరారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 12, 2022, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.