Kishanreddy fires on TRS: మునుగోడులో ఎన్నికల హోరు రణరంగాన్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రతిపల్లిలో ప్రసంగించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్యం, మాంసం, మనీ అక్రమంగా పంచుతూ ఎలాగైనా గెలవాలని తెరాస చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పుడు విధానాల ద్వారా మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.
మునుగోడు ఉపఎన్నిక న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి ఆధర్మానికి మధ్య జరుగుతోందని... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు ఫాంహౌజ్ కట్టుకుంటున్నారన్న ఆయన.. సామాన్యులకు మాత్రం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణత్యాగాలు చేసుకున్నారని.. విద్యార్థులు మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ నినాదాలు ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన రూ.లక్ష అప్పు ఉందన్న కిషన్‌రెడ్డి.. కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేసి.. దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారని ఆరోపించారు.
ఇవీ చదవండి: